Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సూర్య, రవితేజ 3డి చిత్రం డిటైల్స్
సూర్య, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. దీనిని ఓ భారీ 3డి సినిమా రూపొందించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ ' హీరో సూర్యకు లైన్ చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో వున్నాను. హిందీ చిత్రం 'రా. వన్' చిత్రం కోసం షారుక్ ఖాన్‌పై సన్నివేశాలను డిజిటల్ ఫార్మెట్లో చిత్రీకరించిన ఆ తర్వాత వాటిని 3డి ఫార్మెట్లోకి మార్చారు. కానీ నేను దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం నేరుగా ప్రతి సన్నివేశాన్ని 3డి ఫార్మెట్‌లోనే చిత్రీకరించాలనుకుంటున్నాను. దీని కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులని సంప్రదిస్తున్నాం' అని తెలిపారు.
ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ఫైనల్ కానున్నాయి. 2012 జూన్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిప్పు' చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. రవితేజ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.