twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య, రవితేజ 3డి చిత్రం డిటైల్స్

    By Bojja Kumar
    |

    సూర్య, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. దీనిని ఓ భారీ 3డి సినిమా రూపొందించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ ' హీరో సూర్యకు లైన్ చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో వున్నాను. హిందీ చిత్రం 'రా. వన్' చిత్రం కోసం షారుక్ ఖాన్‌పై సన్నివేశాలను డిజిటల్ ఫార్మెట్‌లో చిత్రీకరించిన ఆ తర్వాత వాటిని 3డి ఫార్మెట్‌లోకి మార్చారు. కానీ నేను దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం నేరుగా ప్రతి సన్నివేశాన్ని 3డి ఫార్మెట్‌లోనే చిత్రీకరించాలనుకుంటున్నాను. దీని కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులని సంప్రదిస్తున్నాం' అని తెలిపారు.

    ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ఫైనల్ కానున్నాయి. 2012 జూన్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

    ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిప్పు' చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. రవితేజ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.

    English summary
    By now we all know that director Venkat Prabhu's next film will be produced by Studio Green, owned by Surya's cousin K.E. Gnanavel Raja. There are also reports that the film is going to be a bilingual to be made in Tamil and Telugu. And the exciting news is that Surya and Tollywood star Ravi Teja may star together in this action entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X