»   »  వెంకీ-రవితేజ మల్టీ స్టారర్ మూవీ రెడీ అవుతోంది!

వెంకీ-రవితేజ మల్టీ స్టారర్ మూవీ రెడీ అవుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ravi Teja, Venkatesh Multi-Starrer film on Cards
హైదరాబాద్: వరుస మల్టీస్టారర్ చిత్రాలతో దూసుకెలుతున్న విక్టరీ వెంకటేష్ 'గోపాలా గోపాలా' తర్వాత మరో మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టి, ఎలాంటి భేషజాలకు పోకుండా ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై విశేషంగా ప్రేక్షకాదరణ పొందడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి మల్టీస్టారర్ చిత్రాలపై పడింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత రామ్ తో కలిసి 'మసాలా' చిత్రం చేసాడు వెంకటేష్. తాజాగా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'గోపాల గోపాల' చిత్రం చేస్తున్నాడు. గోపాలా గోపాలా చిత్రం తర్వాత రవితేజతో మరో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి వెంకటేష్ రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

వెంకటేష్-రవితేజ చిత్రానికి వీరూ పొట్ల దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వీరు పోట్ల ఇద్దరికీ స్క్రిప్టు వివరించాడని, ఇద్దరూ అంగీకారం కూడా తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా తెలియనున్నాయి. వెంటేష్, రవితేజ ఇద్దరూ పేరున్న స్టార్లే కాబట్టి ఇటు వెంకీ ద్వారా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, రవితేజ ద్వారా మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే విధంగా వీరూ పొట్ల కథ సిద్ధం చేస్తున్నారి తెలుస్తోంది.

English summary
Ravi Teja, Venkatesh Multi-Starrer film on Cards. It is reliably learnt that Venky and Ravi Teja have given the nod for a film to be directed by Veeru Potla.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu