రవితేజ ఓవర్ చేసాడు, అందుకే సినిమా ఆపేసాం: దిల్ రాజు
హైదాబాద్: రవితేజ, దిల్ రాజు కాంబినేషన్లో ‘ఎవడో ఒకడు' అనే సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో సినిమా ఆగి పోయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధాన కారణం మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ ఓవర్ గా డిమాండ్చే చేయడమేనంట. దీంతో ఇదే కథను నాగార్జునకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.
సరైనోడు టీజర్ రిలీజ్ టైమ్ ప్రకటన
ఈ విషయమై తాజాగా దిల్ రాజు బుధవారం మీడియా సమావేశంలో స్పందించారు. ‘నేను, రవితేజ మంచి ఫ్రెండ్స్. సినిమా అంటే మేమిద్దరమే కాదు. అందరినీ హ్యండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చిన్న చిన్నవాటి వల్ల సినిమా ఆగిపోయింది. ముఖ్యంగా రవితేజతో రెమ్యూనరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రాక పోవడం వల్లనే ఫ్రెండ్లీగా సినిమా ఆపేసాం, ఇప్పుడు అదే కథను నాగార్జునగారితో చేయాలనుకుంటున్నాను. ఆయన్ను అప్రోచ్ అయ్యాను. ఆయన కథ వినాల్సి ఉంది' అన్నారు.

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే హీరో హీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి'. ఈ చిత్రం ఫిభ్రవరి 19న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజు మీడియా సమావేవం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
సునీల్ ఇప్పటి వరకు కృష్ణాష్టమి వంటి సినిమా చేయలేదు. దీంట్లో కొత్త సునీల్ కనపడతాడు. ఇది బన్ని కోసం తయారు చేసుకున్న కథ, సునీల్ చేస్తున్నాడని ఎక్కడా హీరోయిజం తగ్గించలేదు. హీరోయిక్‌గా చూపిస్తూనే సునీల్ టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా ప్లాన్ చేశామని దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











