EAGLE First Review: ఈగల్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో రిజల్ట్ చెప్పేశాడుగా!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా సత్తా చాటుతోన్న రవితేజ ఒకడు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, ఇవేమీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు.
బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'ఈగల్'. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేసేశారు.

రవితేజ నటించిన 'ఈగల్' మూవీని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లను కూడా నిర్వహించింది.
Recommended Video

పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'ఈగల్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్రాన్ని హీరో మాస్ మహారాజా రవితేజ స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఫస్ట్ కాపీని చూసిన తర్వాత అతడి రియాక్షన్ ఎంటో చూపించేందుకు ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
'ఈగల్' మూవీ యూనిట్ షేర్ చేసిన వీడియోలో సినిమాను చూసిన తర్వాత రవితేజ సంతృప్తి వ్యక్తం చేశాడు. దర్శకుడు కార్తీక్‌ను హత్తుకున్న అతడు 'నేను చాలా సంతృప్తిగా ఉన్నాను' అని రివ్యూ ఇచ్చేశాడు. ఇది చూసిన రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. దీనికి Davzand సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











