ఎక్కడకిపోతావు చిన్నవాడా దర్శకుడితో.. డ్యూయెల్ రోల్‌లో రవితేజ!
మాస్ మహారాజ రవితేజ త్వరలో తనకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల దర్సకత్వంలో నటిచబోతున్నాడు. రవితేజ చివరగా నటించిన చిత్రాలు టచ్ చేసి చూడు, నేల టికెట్టు బైక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందాయి. దీనితో తదుపరి చిత్రాల విషయంలో కాస్త ఎక్కువగా రవితేజ కేర్ తీసుకుంటున్నాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఏ చిత్రం తరువాత రవితేజ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విఐ ఆనంద్ దర్శకత్వంలోని చిత్రం ఆసక్తికరమైన కథతో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తారట.

తండ్రి, కొడుకులుగా రవితేజ ఒకే పోలికలతో కనిపిస్తారు. కానీ వీరి మధ్య ఓ వింత వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. అదే ఈ చిత్రానికి కీలకంగా మారనుంది. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే అనేక అంశాలను దర్శకుడు తన కథలో రాసుకునట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











