రవితేజ గురి మాస్ పైనే
హీరో రవితేజ మాస్ పైనే ఎక్కువ గురిపెడుతున్నట్లు ఆయన చిత్రాలు చూస్తుంటే మనకు ఇట్టే తెలిసిపోతుంది. తన నటన ద్వారా మాన్ ని ఆకట్టుకునే రవితేజ ఉన్నట్లుండి శివ నామాన్ని స్మరించాల్సిన అవసరం రవితేజకి ఎందుకొచ్చింది? అనుకుంటున్నారా తాజాగా నటిస్తున్న చిత్రం 'శంబో శివ శంభో". రవితేజ ఇమేజ్ని పదింతలు పెంచే సినిమా ఇది. ఆయన పాత్ర చిత్రణ వైవిద్యంగా ఉంటుంది. 'అల్లరి నరేష్" కథకు వెన్నెము లాంటి పాత్ర. ఈ చిత్రం తమిళ 'నాడోడిగళ్" చిత్రానికి రీమేక్. తమిళ ధర్శకుడు సముద్ర ఖణి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'కిక్", 'ఆంజనేయులు తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం ఇదే. శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే కర్నూలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయంటున్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్.


Click it and Unblock the Notifications











