హాట్ తాప్సీకి రవితేజ 'దరువు'
రవితేజ తాజా చిత్రం 'దరువు'ఇప్పుడు అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రవితేజ ఎవరికి దరువు వేస్తాడు అనేది ఆసక్తి కరమైన అంశం. దీనిపై మాట్లాడుతూ...రవితేజ ఉంటే చుట్టూ తీన్‌మారే. అంత గోల చేస్తాడు. తను సంతోషంగా ఉండడమే కాదు. పక్కవారి చేత కూడా కేరింతలు కొట్టిస్తాడు. అతనికి రెండో పార్శ్వం కూడా ఉంది. కోపంగా చూశాడంటే చాలు. శత్రువుకి దరువు మొదలైనట్టే. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే 'దరువు' సినిమా చూడాల్సిందే అంటున్నారు. 'సౌండ్ ఆఫ్ మాస్' అనేది ఉపశీర్షికతో రెడీ అవుతున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా చేస్తోంది. శౌర్యం శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. తాప్సీ,రవితేజ లపై సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ ''రవితేజ శైలిలో సాగే చిత్రమిది. యాక్షన్ అంశాలు జోడించాం. ఆయన పాత్ర విభిన్నమైన కోణాల్లో కనిపిస్తుంది. సినిమాను తొందరగా పూర్తి చేసి వేసవికి విడుదల చేయాలనుకొంటున్నాము''అన్నారు. జయసుధ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్నారు. సంగీతం: విజయ్ ఆంథోని.


Click it and Unblock the Notifications











