రాజమౌళి అసిస్టెంట్‌తో రవితేజ ‘జింతాతా’!
హైదరాబాద్: రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'విక్రమార్కుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న ఆసక్తికర వార్త ఏమిటంటే....'విక్రమార్కుడు' చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'జింతాతా' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. విక్రమార్కుడు సినిమాలో జింతాతా మేనరిజం బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో సీక్వెల్ కి అదే టైటిల్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
రాజమౌళి వద్ద గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కోటి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తారని అంటున్నారు. విక్రమార్కుడు చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈచిత్రానికి కూడా మ్యూజిక్ ఇస్తారని తెలుస్తోంది. జనవరి నెలలో ఈచిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారని, అప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.
రాజమౌళి ఆశీస్సులతోనే ఈచిత్రం సీక్వెల్ ప్లాన్ జరుగుతోందని....రాజమౌళి దర్శకత్వం కాక పోయినా రాజమౌళి దగ్గర పని చేసిన అనుభవంతో ఆ రేంజిలో సినిమాను తీయడానికి కోటి ప్లాన్ చేసుకుంటున్నాడని, 'జింతాతా' చిత్రం కోసం రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నాడని సమాచారం.
ఇటీవల విడుదలైన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు సినిమాలతో పరాజయం చవి చూసిన రవితేజ ప్రస్తుతం 'సార్ వచ్చారు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా 'బలుపు' అనే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న 'బలుపు' చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది.


Click it and Unblock the Notifications











