Eagle Postponed ‘రవితేజ వెనక్కి తగ్గారని అనుకోవద్దు.. మాస్ మహారాజా ఫ్యాన్స్ అర్ధం చేసుకోండి’

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగిల్ సినిమా సంక్రాంతి పండుగ రేసు నుంచి తప్పుకొన్నది. ఇప్పటికే సంక్రాంతి పండుగకు నాలుగు భారీ సినిమాలు రిలీజ్‌కు ఉండటంతో నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల తమ చిత్రం రిలీజ్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ప్రసన్న కుమార్, అనుపమ్ రెడ్డి, వెంకట్ బోయినపల్లి, వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్, దామోదర ప్రసాద్, కే నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..

Recommended Video

తగ్గి నెగ్గిన Raviteja.. Why Eagle Movie Postponed? రవన్న మూవీ వాయిదా కి కారణం | Telugu FilmiBeat

ప్రతి సంక్రాంతి పండుగ సమయంలో సినిమాల రిలీజ్ విషయంలో ఏదో ఒక సమస్య ఎదురువుతూనే ఉంది. దాంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో చర్చించి ఆ నిర్ణయాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు వెల్లడించాం. రెండు ఛాంబర్ల ప్రతినిధులతో మాట్లాడాం. ఆ సమయంలో ఎవరో ఒకరు సినిమా రిలీజ్ వాయిదా వేయాలని రిక్వెస్ చేశాం. ఆ సమయంలో హనుమాన్ ప్రొడ్యూసర్ హాజరుకాలేకపోయారు అని ప్రసన్న కుమార్ తెలిపారు.

 Ravi Tejas Eagle Postponed from Sankranti 2024 Race: Here is Producer Prasanna Kumar briefing

తెలుగు, తెలంగాణ ఛాంబర్ల ప్రతినిధుల మీటింగ్‌లో సూచన చేసిన తర్వాత వారికి ఆలోచించుకోవడానికి సమయం తీసుకోమన్నాం. ఆ క్రమంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల తమ సినిమా ఈగిల్ రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. హీరో రవితేజ కూడా ఇండస్ట్రీకి మేలు చేసే విధంగా సపోర్ట్ చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని ప్రసన్న కుమార్ అన్నారు.

ఎవరైతే సంక్రాంతి బరి నుంచి తప్పుకొంటే వారికి సోలో రిలీజ్‌కు అవకాశం ఇవ్వాలని రెండు ఫిలిం ఛాంబర్ల ప్రతినిధుల సమావేశంలో నిర్ణయించాం. ఆ క్రమంలోనే ఈగిల్ సినిమా సింగిల్ రిలీజ్ అయ్యేలా ఇతర నిర్మాతలతో చర్చిస్తాం అని ప్రసన్న కుమార్ అన్నారు.

 Ravi Tejas Eagle Postponed from Sankranti 2024 Race: Here is Producer Prasanna Kumar briefing

సంక్రాంతి రేసు నుంచి రవితేజ తన సినిమాను తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. జనవరిలో ఇతర సినిమాలు స్మూత్‌గా రిలీజ్ అవ్వడానికి కోఆపరేట్ చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆయన అభిమానులు హర్ట్ కావొద్దు. రవితేజ వెనక్కి తగ్గారని అనుకోవద్దు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేస్తే.. పది అడుగులు ముందుకు వేయడానికి. కాబట్టి ఫ్యాన్స్ ఈ విషయాన్ని సహృదయంతో అర్ధం చేసుకోవాలి అని ప్రసన్న కుమార్ రిక్వెస్ట్ చేశారు.

 Ravi Tejas Eagle Postponed from Sankranti 2024 Race: Here is Producer Prasanna Kumar briefing

రవితేజ, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్ణయంతో ఈగిల్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఇతర సినిమాల నుంచి పోటీ లేకుండా సింగిల్ రిలీజ్ అయ్యేలా చర్యలు తీసుకొంటాం. సినిమా పరిశ్రమలో సమస్య రాకుండా నిర్ణయం తీసుకొన్న ఈగిల్ టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తాం. రవితేజ చేసిన కోఆపరేట్ చేసినందుకు ఆయన అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి అని ప్రసన్న కుమార్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X