రవితేజ ‘దరువు’ సెన్సార్ కట్స్
మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న 'దరువు' చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ కట్స్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
సెన్సార్ సర్టిఫికెట్ నెం : DIL/2/5/2012-HYD
సర్టిఫికెట్ డేట్ : 15/05/2012
డ్యూరేషన్ : 159:00 MM:SS
కట్స్ లిస్ట్
1. హీరో చెప్పే డైలాగులో 'నీయబ్బ, ఇంకా ఏదోకాలింది' తీసేయబడింది
2. గ్రూపు డిస్కర్షన్, నా కొడకా, బేస్ చూపిస్తావా పదాలు తొలగింపు
3. బ్రహ్మానందం కాళ్ల దగ్గర మనీ విజువల్స్ బ్లర్ చేయబడ్డాయి
4. నీయబ్బ, సెటప్, స్టెపినీ, అన్నీ కోసేస్తా డైలాగులు డిలీట్
5. 9888888111 ఫోన్ నెంబర్ లేకుండా చేయడం
6. ఆనా కొడుకు, వి.పి డైలాగులు డిలీట్ చేయడం, మరియు 'ఆంధ్రప్రదేశ్, రంగారెడ్డి బ్లర్ చేయడం'
7. సెక్సీ లేడీ సాంగులో...ఆడ బొమ్మలు పదం తొలగించడం, క్లోజ్ అప్‌గా బొడ్డు ఎక్స్ ఫోజింగ్ సీన్లు బ్లర్ చేయడం
8. 'లుచ్చా' అనే డైలాగ్ డిలీట్
9. నైట్ పాపలతో సెట్టింగారా..అనే డైలాగ్ తొలగింపు
10. కూష్మాండం పగిలి పోద్ది అనే డైలాగ్ కట్
11. వెలుగుతున్న బల్బులో ఫ్యూజ్ కొట్టేస్తే డైలాగులో 'బల్బ్ లో ఫ్యూజ్' వినపడకుండా చేయాలి
12. హీరో మందు కొట్టేప్పుడు, స్మోకింగ్ చేసే టప్పుడు...అవి హానికరం అనే చట్టబద్దమైన హెచ్చరికలివ్వాలి
13. కర్చిఫ్ వేసిన అమ్మాయి అనే డైలాగును...మనసు పెట్టిన అమ్మాయి డైలాగులో రీప్లేస్ చేయాలి
14. ఏ కట్టింగ్ అవ్వని నీకు కేక్ కట్టింగ్ అవసరమా అనే డైలాగులో 'ఏ కట్టింగ్' పదం తొలగించాలి.
దరువు చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. శివ(శౌర్యం ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











