ఎన్నారై బ్యాక్ డ్రాప్ లో 'మరో చరిత్ర'?

ఇప్పటికే బాలచందర్ వద్ద ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకొన్న దిల్ రాజు ఈ చిత్రం షూటింగ్ మొత్తాన్ని యు.యస్ లోనే షూట్ చేయనున్నట్లు తెలియవచ్చింది. ఒకప్పటి క్లాసిక్స్ ని మళ్ళీ తీయడమే ఒక సాహసం అనుకొంటే లెజెండ్ కమల్ హాసన్ వంటి ఆర్టిస్ట్ చేసిన పాత్రని అమెచ్యూర్ వరుణ్ తో తీయడం ఇంకా పెద్ద సాహసం గానే చెప్పుకోవాలి. ఏది ఏమైనా తీస్తుంది దిల్ రాజు కాబట్టి ఈ చిత్రం కూడా హిట్టే అవుతుందేమో అనే వారు లేకపోలేదు.
ఇక ఈ చిత్రం ఎన్నారైల ప్రేమ కథగా స్క్రిప్టు మార్చారని కొన్ని టాక్స్ వినపడుతున్నాయి. అప్పట్లో తమిళ కుర్రాడికీ,ఆంధ్రా అమ్మాయికీ మధ్య నడిచే లవ్ స్టోరీగా వచ్చింది. మారుతున్న స్ధితిలో దేశాలు దాటి యువత వెళ్తున్నారు. అటువంటి స్ధితిలో ఎన్నారైల మధ్య ప్రేమకధగా దీన్ని మార్చారని అంటున్నారు. చూద్దాం ఏ మేజిక్ జరగనుందో.త్వరలోనే ఈ చిత్రం అధికార ప్రకటన వెలవడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











