అల్లరి రవిబాబు రీసెంట్ గా నచ్చావులే సినిమాతో హిట్ కొట్టారు. అంతా కొత్త వాళ్ళతో రూపొందించి, పబ్లిసిటీలో సైతం కోతులు, కుక్కలు పెట్టి రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన అమరావతి, ఏజెంట్ గోపి అనే రెండు చిత్రాల స్క్రిప్ట్ లు రెడీ చేసారని సమాచారం. మొదట్లో విపరీతమైన హాలీవుడ్ ఇన్ఫూలియన్స్ ఉన్న వ్యక్తిగా ఇబ్బందులు పడినా చివరకు తెలుగు ఆడియన్స్ పల్స్ ఎట్టకేలకు పట్టుకున్న వ్యక్తిగా ఆయన నిలదొక్కుకున్నారు. ఇక ఈ రెండు స్క్రిప్టులను ఇద్దురు పెద్ద ప్రొడ్యూసర్స్ కి వినపించారని తెలుస్తోంది. అయితే ఏది ముందు ఓకే చేస్తే దానికి ఆయన పచ్చజెండా ఉండి సినిమా ప్రారంభించే యోచనలో ఉన్నారు. చిన్న సినిమాకు విజయవంతమైన నిర్వచనం చెప్పగలగటమే ఆయన సక్సెస్ కి కారణమని అంతా అంటున్నారు.బెస్టాఫ్ లక్ రవిబాబు.