రవితేజ ని డైరక్ట్ చేస్తున్న రవిబాబు
రవితేజ, అనూష్క కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్స్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మరో ప్రత్యేకతను సంతరించుకుంది. అనసూయతో తానేమిటో నిరూపించుకున్న రవిబాబు దర్శకత్వంలో మూడు పాటలు చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా రవిబాబు సినిమాలు మంచి విజువల్ సెన్స్ తో ఆకట్టుకుంటాయి. అందుకే సురేష్ బాబు ఆయనతో వరస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు పాటల పని అప్పచెప్పారు. ఈ విధంగా పాటలు వేరే దర్శకులకు అప్పచెప్పే ట్రెండు యేలేటి 'ఒక్కడున్నాడు' సినిమాతో ఈ మధ్య ప్రారంభమయింది. అందులో పాటల్ని కృష్ణవంశి తనదైన స్టైల్ లో తీసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు రవిబాబు వంతు. మరి ఈ ట్రెండుని అనుసరించి ఇకెంత మంది ముందుకొస్తారో...


Click it and Unblock the Notifications











