నయనతార..కీచక పర్వం

By Srikanya

నయనతార త్వరలో కీచక అనే టైటిల్ తో పాపులర్ అయిపోవచ్చు. ప్రభుదేవా మ్యాటర్ లో మాత్రం కాదు. విషయం ఏమిటంటే ఆమె తాజాగా కన్నడంలో అడుగుపెడుతూ కీచక అనే టైటిల్ గల ఓ చిత్రం కమిట్ అయింది. మొట్టమొదటి సారి కన్నడంలో చేస్తున్న చిత్రం కావటంతో హిట్టయితే అదే పేరుతో కీచక ఫేమ్ నయనతార అంటారు. ఇక ఈ చిత్రాన్ని రవిచంద్రన్ దర్శకత్వం వహించి నిర్మిస్తున్నాడు. అంతేగాక తండ్రి కొడుకులుగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సంగీతం కూడా అందిస్తున్నాడు. తండ్రి పాత్రకు జోడిగా భానుప్రియ, కొడుకు పాత్రకు జంటగా నయనతార నటించనున్నారు. 'రక్తకన్నీరు' ఫేమ్ ముని రత్న నిర్మించనున్న ఈ చిత్రం ఈనెల 18న సెట్స్ పైకి రాబోతోంది. అదీ నయనతార కీచకపర్వం. ప్రస్తుతం నయనతార ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రంలో చేస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X