ఇక్కడ వెంకటేష్...అక్కడ రవిచంద్రన్

By Srikanya

బెంగళూరు: క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌, నవ్యానాయర్‌ జంటగా నటించిన 'దృశ్య' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఆడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రవిచంద్రన్‌ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చడం ఇదే ప్రథమం. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' సినిమా రీమేక్‌గా దీన్ని రూపొందించారు. నిర్మాణానంతర కార్యకలాపాల్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ వెంకటేష్,మీనా ఈ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కనిపించేదంతా నిజం కాదు అనే ట్యాగ్ లైన్ తో వెంకటేష్ తాజా చిత్రం 'దృశ్యం‌' ఫస్ట్ లుక్ వచ్చేసింది. వెంకటేష్‌ మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన 'దృశ్యమ్‌' సినిమాని తెలుగులో వెంకటేష్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయటానికి నిర్ణయించారు. మేజర్ పార్ట్ ని వైజాగ్ రూరల్ ఏరియాలో పూర్తి చేయనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

 Ravichandran in Drishyam Remake

మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.

వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X