Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదొక ఎమోషనల్ మూమెంట్.. అందుకే ఆ ముద్దు.. హీరోతో లిప్ లాక్‌పై దర్శకుడు క్లారిటీ
లిప్ లాక్ అంటే మామూలుగా హీరోహీరోయిన్ల మధ్యనే ఊహించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ హీరో, దర్శకుడి మధ్యలో జరిగింది. వారిద్దరి లిప్ లాక్ పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈపాటికే అర్థమైందనుకుంటాను. కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్ర దర్శకుడు రవికాంత్, హీరో సిద్దుల లిప్ లాక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనే లేవనెత్తింది. తాజాగా వాటిపై దర్శకుడు స్పందించాడు.
అద్భుతమైన స్పందన..
ఇటీవల ఓటీటీలో రిలీజైన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన సినిమాల్లో ఇదొక్కటే బ్లాక్ బస్టర్ హిట్. అయితే పెంగ్విన్‌కు ఉన్న స్టార్ కాస్ట్ దృష్ట్యా ఎక్కువ మంది, ఎక్కువ గంటలు వీక్షించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అయితే కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీకి మాత్రం అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.
వివాదాల నడుమ..
కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రానికి పాజిటివ్ టాక్ బాగానే వ్యాప్తి చెందింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రల పేరు హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచినట్టు ఉండటంతో కొందరు ఫిర్యాదులు చేశారు. ఇలాంటి ఈ వివాదం నడుస్తూ ఉంటే హీరో, దర్శకుల లిప్ లాక్ పిక్ మరింత సెన్సేషన్ అయింది.
హీరో దర్శకుల లిప్ లాక్..
హీరో దర్శకుల మధ్య ఉండే సంబంధం అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి తీసిన సినిమా హిట్ అయితే , వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే ఎంతో ఆనందిస్తారు. ఆ సమయంలో వారు పడ్డ కష్టాన్ని అంత మరిచిపోతారు. అయితే ఈ హీరో డైరెక్టర్ మాత్రం కాసింత శ్రుతిమించారు. ఒకరినొకరు హత్తుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలేవనెత్తాయి.
ప్రచారం కోసం చేయలేదు..
వివాదానికి కారణమైన ముద్దు, ఆ ఫోటోపై దర్శకుడు ఓ మీడియాతో మాట్లాడుతూ.. అది ప్రచారం కోసం చేసింది కాదని తెలిపాడు. దాని వెనుక మూడు సంవత్సరాల కష్టం ఉందని చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరికీ అదొక ఎమోషనల్ మూమెంట్ అని తెలిపాడు. అంతేకానీ, అది సెన్సేషనలైజ్ చేయడానికో.. వైరల్ చేయడానికో కాదని స్పష్టం చేశాడు.