ఆశ్చర్యం: మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో జై బాలయ్య!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల ఫంక్షన్లంటే ఏ రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. వేల సంఖ్యలో అభిమానులు.....జై చిరంజీవ, జై పవనిజం, జై రామ్ చరణ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణాలు మార్మోగిపోతుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా ఓ మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో జై బాలయ్య నినాదం వినిపించింది. అది కూడా డైరెక్టర్ నోటి వెంట.

వివరాల్లోకి వెళితే....మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో సక్సెస్ మీట్ ఇటీవల విజయవాడలో జరిగింది. ఈ చిత్రానికి ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన బాలయ్యతో ‘వీరభద్ర' చిత్రం తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అయిన రవికుమార్ చౌదరి ఈ సందర్బంగా తన మనసులోని మాట బయట పెట్టారు.

Ravikumar Chowdary about Balakrishna

ఈ సందర్భంగా రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. ‘జై పవన్....జై బాలయ్య. మేమే సినిమా వాళ్లం. మాకు అందరూ కావాలి. నేను బాలయ్యకు వీరాభిమానిని. నా బ్రదర్ చిరంజీవి ఫ్యాన్. నేనే జీవితంలో చాలా కోల్పోయాను. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మళ్లీ నిలదొక్కుకుంటాను అనే నమ్మకం ఉంది' అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. సినిమా చిత్రీకరణ పూర్తై రీసెంట్ గానే ఆడియో విడుదలైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయటానికి నిర్ణయించారు.

చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X