For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బండ్ల ఈజ్ బ్యాక్ విత్ మాస్ మహరాజ్...!, మళ్ళీ సినిమా మొదలు పెడుతున్నాడట

  |

  ఒకప్పుడు చిన్న స్థాయి కమెడియన్‌గా ఉండి.. ఆ తర్వాత అనుకోకుండా పెద్ద నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. ఓ దశలో పెద్ద పెద్ద కాంబినేషన్లలో వరుసగా భారీ సినిమాలు నిర్మించాడు. కానీ 'టెంపర్' తర్వాత అనుకోకుండా బ్రేక్ తీసుకున్నాడు. రెండున్నరేళ్లుగా అతడి నుంచి సినిమానే రాలేదు. బండ్ల బేనర్లో సినిమా ఏదీ మొదలే కాలేదు కూడా. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి వారితో సినిమాలు చేసిన బండ్ల గణేష్, నిర్మాతగా తొలిచిత్రం మాత్రం రవితేజతోనే చేశాడు. పరుశురామ్ దర్శకత్వంలో 'ఆంజనేయులు' టైటిల్‌తో వచ్చిన రవితేజ సినిమానే బండ్ల గణేష్ నిర్మాతగా తొలి సినిమా. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

  టు కంట్రీస్

  టు కంట్రీస్

  బండ్ల గణేష్ ఆ మధ్యలో మలయాళ హిట్ మూవీ ‘టు కంట్రీస్'ను రీమేక్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆ సినిమాను కూడా వదిలేశాడు. ఐతే ఎట్టకేలకు బండ్ల ఓ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. చేస్తే పెద్ద హీరోతోనే సినిమా చేయాలన్న పట్టుతో రెండేళ్లగా బండ్ల గణేష్ సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు.

  పౌల్ట్రీ బిజినెస్ పై దృష్టి పెట్టాడు

  పౌల్ట్రీ బిజినెస్ పై దృష్టి పెట్టాడు

  చివరకు మాస్ మహారాజా రవితేజ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘‘బండ్ల గణేష్ ఇన్నాళ్లూ తనకున్న పౌల్ట్రీ బిజినెస్ పై దృష్టి పెట్టాడు. ఇండస్ట్రీలోకి తిరిగి రావడానికి సరైన అవకాశం కోసం చూస్తున్నాడు. రవితేజతో సినిమా ప్రొడ్యూస్ చేయడం ద్వారా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు'' అని తనకున్న సన్నిహితుడొకరు తెలిపారు. ఈ సినిమాకు డైరెక్టర్ ను కూడా ఫైనల్ చేశాడని... త్వరలో సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసి వివరాలు రివీల్ చేయాలని అనుకుంటున్నాడట.

   అందరినీ ట్రయ్ చేసాడు

  అందరినీ ట్రయ్ చేసాడు

  టెంపర్ తరువాత ఇంతవరకు సినిమా చేయలేదు నిర్మాత బండ్ల గణేష్. పవర్ స్టార్ నుంచి అఖిల్ దాకా అందరినీ ట్రయ్ చేసాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి డబ్బింగ్ సినిమాలు వదుల్దాం అనుకున్నాడు అవీ సెట్ కాలేదు. ఇప్పుడు చివరాఖరికి రవితేజ ను పట్టుకున్నాడు. బండ్లను నిర్మాతను చేసింది రవితేజనే.

  రవితేజకు మద్దతుగా

  రవితేజకు మద్దతుగా

  మరి ఆ విశ్వాసంతోనో, మరెందుకో, డ్రగ్స్ కేసులో రవితేజను వెనకేసుకుని వచ్చాడు. మరే నిర్మాత, డైరక్టర్ మాట్లాడకపోయినా, రవితేజకు మద్దతుగా బోలెడు ట్వీట్లు చేసాడు. ఇవన్నీ ఫలించి, రవితేజ అభిమానంతో బండ్లకు ఓ సినిమా చేసి పెడతున్నాడేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

   తన కెరీర్‌కు ఆపద

  తన కెరీర్‌కు ఆపద

  వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కథ, స్క్రిప్టు విషయంలో ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది.

  రాజా ది గ్రేట్

  రాజా ది గ్రేట్

  రవితేజ డైరీ ప్రస్తుతం ఖాళీ లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించిన రాజా ది గ్రేట్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో టచ్ చేసి చూడు చేస్తున్నాడు. దీని తర్వాత తమిళ్ సూపర్ హిట్ ఫిలిం బోగన్ రీమేక్ లో చేయబోతున్నాడు. బండ్ల గణేష్ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాల్సి ఉంది.

  English summary
  Now the buzz is that Bandla Ganesh is planning to make a successful come back with an interesting film having Mass Maha Raja Ravi Teja in the lead role. Ravi Teja has given his nod for a film to be produced by Bandla Ganesh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X