అల్లు అర్జున్ స్థానంలో రవితేజ. త్వరలో సినిమా ప్రారంభం!
రవితేజ కొత్త సినిమా ఒప్పుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిస్కో రాజా పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
Recommended Video


బిజీగా గడుపుతున్న రవితేజ
నిర్మాత రామ్ తాళ్లూరి తో ఎస్.ఆర్.టి బ్యానర్ లో రవితేజ ప్రస్తుతం ‘నేలటికెట్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి రవితేజతో ఈ నిర్మాత సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిస్కో రాజా పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం.

విఐ ఆనంద్ తో మాస్ రాజా రవితేజ సినిమా
వి.ఐ.ఆనంద్ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోంది. రవితేజ బాడి లాంగ్వేజ్ కు సెట్ అయ్యే విధంగా వి.ఐ.ఆనంద్ ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంభందించిన న్యూస్ నిర్మాతలు అధికారికంగా వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం రవితేజ నేలటికెట్ సినిమాతో పాటు శ్రీనువైట్ల సినిమా చేస్తున్నాడు.

రవితేజ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్
‘ఒక్క క్షణం' సినిమా తరువాత వి.ఐ.ఆనంద్ రవితేజను దర్శకత్వం వహించబోతుండడం విశేషం. రవితేజ ఏప్రిల్ నుండి శ్రీను వైట్ల సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత వి.ఐ.ఆనంద్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు మాస్ రాజ. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ స్థానంలో రవితేజ
వి.ఐ.ఆనంద్ మొదట ఒక సబ్జెక్టు ను అల్లు అర్జున్ కు చెప్పడం జరిగింది. కాని ఆ సినిమా మొదలు కాలేదు. విఐ ఆనంద్ రవితేజ తో సినిమా చేసాక అల్లు అర్జున్ సినిమా చేస్తాడని సమాచారం. అల్లు అర్జున్ నెక్స్ట్ చెయ్యబోయే సినిమాకు సంభందించి ఆఫిషియల్ న్యూస్ త్వరలో రానుంది.


Click it and Unblock the Notifications











