మిస్టర్ ఖతర్నాక్ - రవితేజ
డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి మిస్టర్ ఖతర్నాక్, శ్రీశైలం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇలియానా తొలిసారి రవితేజ సరసన నటిస్తోంది. గోపిచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించిన రణం చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. దీనితో వెంటనే ఆయన రవితేజతో చిత్రాన్ని ప్రారంభించి దాన్ని దాదాపు పూర్తి చేశారు. ఇది కాక ఒక మంచి సబ్జెక్ట్ చెప్పి మెగాస్టార్ చిరంజీవిని కూడా రాజశేఖర్ ఒప్పించారని తెలుస్తోంది. రవితేజతో చేస్తున్న చిత్రానికి మిస్టర్ ఖతర్నాక్ టైటిల్ దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో రవితేజ ఒక మాస్ పాత్ర పోషిస్తున్నారు. అది కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనం ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications