సౌండాఫ్ మాస్...కౌంట్ డౌన్
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న దరువు(సౌండ్ ఆఫ్ మాస్) ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం జరుగనున్న నేపథ్యంలో కౌంట్ డౌన్ స్టార్ అయింది. సినిమా పేరులోనే దరవు ఎండటంతో సినిమా ఆడియో మంచి జోష్ ఉన్న మాస్ బీట్స్‌తో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రసాద్ లాబ్స్‌లో ఈ చిత్రం ఆడియో వేడుక కార్యక్రమం జరుగనుంది. విజయ్ ఆంటోని ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రానికి శౌర్యం ఫేం శివకుమార్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు.
హీరోయిన్ తాప్సీ రవితేజ సరసన రొమాన్స్ చేస్తుండగా...తమిళ నటుడు ప్రభు ఇందులో యమధర్మరాజుగా కనిపించనున్నాడు. రవితేజ పాత్ర ఈ చిత్రంలో గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. 5 షేడ్స్‌లో వెరైటీగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు. మే 4న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ


Click it and Unblock the Notifications











