Sankranthi 2024: సంక్రాంతి రేస్ నుంచి ఆ రెండు పెద్ద సినిమాలు ఔట్.. ఇక పోటీ 6 చిత్రాల మధ్యనే!
కొత్త సంవత్సరం.. కొత్త పండుగలు.. ముఖ్యంగా తొలి పండుగ సంక్రాంతి. ఈక్రమంలోనే ఈ పండుగకు అలరించేందుకు అనేక చిత్రాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ విపరీతమైన పోటీ మధ్య పండుగ రోజే వచ్చేందుకు ప్లాన్ చేసకుంటున్నాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తం 8 సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. పోటీ తప్పుకునే వీలే లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఈ సంక్రాంతి పండుగ రేస్ నుంచి ఓ రెండు పెద్ద చిత్రాలు తప్పుకున్నాయి. ఆ రెండు సినిమాలు ఏవి, ఎందుకు తప్పుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2024 సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం 8 సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. అందులో అందులో 12వ తేదీ రోజే.. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జా హనుమాన్, ధనుష్ కెప్టెన్ మిల్లన్, శివకార్తికేయన్ అయలాన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ లు వస్తున్నట్లు చెప్పాయి. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13వ తేదీ రోజు సైంధవ్, ఈగల్ సినిమాలు విడుదల కాబోతున్నట్లు ప్రకటించాయి. ఇక చివరి రోజు అంటే 14వ తేదీ రోజు నా సామి రంగా సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

అయితే ఈ పోటీ నుంచి తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ఈగల్ సినిమా తప్పకుంది. పోటీ ఎక్కువగా ఉండడంతో.. ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకే ఎక్కువ మొత్తం థియేటర్లు వెళ్లిపోవడంతో ఈగల్ కు అంతగా థియేటర్లకు దొరకట్లేదట. ఈక్రమంలోనే ఈ సినిమా వాయిదా వేసుకుంటే బాగుందనే ఆలోచనలో పడిందట చిత్రబృందం. ముఖ్యంగా జనవరి 26వ తేదీ రోజు సింగిల్ గా వస్తే బెటర్ అని అనుకున్నారట. అందుకే వెనక్కి తప్పుకోవాలని చూస్తున్నారు.
50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను వాయిదా వేసుకుంటే ఎక్కువ లాభాలు రాబట్టుకునే అవకాశం ఉన్నందున వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల కోసం ఇప్పటికే కొన్ని థియేటర్లు బుక్ కాగా.. వాటిని క్యాన్సిల్ చేసుకోవడమా.. లేక ఎవరికైనా ఇచ్చుకోవడమా అని ఆలోచిస్తున్నారుట. ఎక్కువ శాతం ఈ సినిమాకు దొరికిన థియేటర్లను కింగ్ నాగార్జున నా సామి రంగా సినిమాకు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

ఇది మాత్రమే కాకుండా తమిళ భాషలో తెరకెక్కిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే తమిళంలో ఈ చిత్రాన్ని అనుకున్న రోజే విడుదల చేస్తుండగా... ఒక్క తెలుగులో మాత్రమే సంక్రాంతికి కాకుండా ఆ తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. పోటీ ఎక్కువగా ఉండడం.. థియేటర్లు దొరక్కపోవడం వల్లే దర్శక, నిర్మాతలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











