కత్తి 'టచ్'.. రవితేజ ఫ్యాన్స్ 'హర్ట్': మళ్లీ చిచ్చు.., అదే అల్టిమేట్ అన్న క్రిటిక్..
ఒక వివాదం సద్దుమణిగిందో లేదో అప్పుడే మరో వివాదంలో ఇరుక్కున్నారు ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి. నిన్నటిదాకా పవన్ ఫ్యాన్స్‌తో నడిచిన ఆయన పేచీ ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్‌కు షిఫ్ట్ అయింది. 'టచ్ చేసి చూడు' సినిమాను 'టచ్ చేయకపోవడమే బెటర్' అంటూ ఆయన చెప్పిన రివ్యూపై ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.. ఇంతకీ ఏంటీ పేచీ

'ఇట్స్ నాట్ ఫెయిర్' :
సినిమా రివ్యూ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ.. చూడవద్దు అని చెప్పడానికి మీకే హక్కు ఉందంటూ మహేష్ కత్తిని రవితేజ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. 'ఇట్స్ నాట్ ఫెయిర్' అంటూ ఆయన్ను తప్పుపడుతున్నారు.
అదే అల్టిమేట్..: కత్తి
మరోవైపు కత్తి మాత్రం 'సినిమా నచ్చితే చూడమని రికమెండ్ చేసినట్లే.. నచ్చకపోతే చూడకపోతేనే బెటర్ అని కూడా చెప్తాం. ఛాయిస్ మాత్రం ప్రేక్షకుడిదే. అదే అల్టిమేట్. రివ్యూ అంటేనే అభిప్రాయం. అది ఇలాగే ఉండాలి అని ఎవరూ డిసైడ్ చేయలేరు' అంటూ రవితేజ అభిమానులకు బదులిచ్చారు.

కత్తి రివ్యూ..:
'టచ్ చేసి చూడు అర్థం పర్థం లేని యాక్షన్ డ్రామా. సెన్స్‌లెస్ స్టోరీ. ఎందుకు పెట్టారో అర్థం కాని సీన్స్. రవితేజ టైమ్ వేస్ట్ చేసుకున్నాడు. టచ్ చేయకపోతేనే బెటర్' అంటూ ఓ టీవి చానెల్ లో కత్తి చెప్పిన రివ్యూ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

అభిమానులకు నచ్చట్లేదు..:
నిజానికి మహేష్ కత్తి తన రివ్యూలకు రేటింగ్ ఇవ్వనని చెబుతున్నాడు. సినిమా విశ్లేషణ వరకే పరిమితమవుతానని, రేటింగ్ జోలికి పోనని గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ పరోక్షంగా సినిమా చూడవద్దంటూ కత్తి చెప్పడం ఏమాత్రం సరికాదనేది అభిమానుల వాదన.

షరా మామూలే:
కత్తి నిర్మొహమాటంగా రివ్యూలు చెప్పడం.. దానికి ఆయా హీరోల అభిమానులు నొచ్చుకోవడం.. ట్విట్టర్ లో ఇరువురి మధ్య వార్ జరగడం కామన్ అయిపోయింది. 'టచ్ చేసి చూడు' విషయంలోనూ ఇప్పుడిదే జరుగుతోంది. అయితే పవన్ ఫ్యాన్స్ తో జరిగినంత సీరియస్ వివాదంగా ఇదేమి కనిపించడం లేదు. కాబట్టి కొద్దిరోజులు పోతే మళ్లీ షరా మామూలే.


Click it and Unblock the Notifications











