ఎన్టీఆర్-చెర్రీ మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ?: మాస్ రాజా ఏం చెప్పాడో తెలుసా!..
మాస్ ఓల్టేజ్‌కు మారుపేరు రవితేజ. తెరపై ఆయన చేసే పాత్రలు అంతలా బ్లాస్ట్ అవుతాయి. ఇప్పుడు 'టచ్ చేసి చూడు' అంటూ తెర మీద మరోసారి బ్లాస్ట్ అయ్యేందుకు సిద్దమైపోయాడు. కెరీర్ ఆరంభం ఎక్కడా తగ్గని ఆయన ఎనర్జీ లెవల్స్.. ఈ సినిమాలోనూ పీక్స్ లో కనిపిస్తాయని టాక్. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవబోతుండటంతో.. ట్విట్టర్ వేదికగా అభిమానులతో టచ్ లోకి వచ్చారు రవితేజ. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో ఆయన సరదా సంభాషణ మీకోసం..
Recommended Video

రోహిత్ చౌదరి:
ఆర్జీవి గారితో సినిమా ప్లాన్ ఏమైనా ఉందా?.. త్రివిక్రమ్ కాంబినేషన్ లోనూ చూడాలని ఉంది?
ఇద్దరితో కలిసి ఒకే సినిమా అయితే చేయలేం కదా!.. సో.. చూద్దాం..
టచ్ చేసి చూడు గురించి ఒక్క మాటలో?
'యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్'. అందరిని ఆకట్టుకునే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఇంతకుమునుపెన్నడూ చూసి ఉండరు.
ఫ్యాన్స్‌కు ఏం చెబుతారు?
బీ పాజిటివ్&హెల్తీ. మీరే నా జీవితం..

మహాధన్(రవితేజ కొడుకు) తదుపరి సినిమా?
ప్రస్తుతానికి తనను ఒంటరిగా వదిలేయండి..
ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్?:
ఇళయరాజా గారు..
ఇండస్ట్రీలో మీ ఫస్ట్ క్రష్ ఎవరితో?
హమ్‌మ్‌మ్.. చెప్తారు(వ్యంగ్యంగా..)
రవితేజ గారు కొంపదీసి తారక్-చరణ్ మూవీలో విలన్ క్యారెక్టర్ మీరే చేస్తున్నారా ఏంటి?
ఊహించుకోవడాలు వద్దు.. కానీ మంచి ప్రయత్నమే.
ఇండస్ట్రీలో ఎవరైనా హీరోయిన్‌ను లవ్ చేశారా?
అబ్బా.. ఛా..(ఫన్నీగా..)
అమితాబ్ గారితో మీరు నటిస్తే చూడాలనుంది?..
నేను కూడా దానికోసం ఎదురుచూస్తున్నా..
శ్రీనువైట్లతో మళ్లీ వర్క్ చేయడం గురించి?
తనతో నా కాంబినేషన్ ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. అది మళ్లీ మళ్లీ రిపీట్ కాబోతుంది.
మీ బీహారీ ఫ్యాన్స్ గురించి ఏమైనా చెప్పండి ప్లీజ్?
హాయ్ గాయ్స్.. ఆల్ ది బెస్ట్ టూ యూ ఆల్..


Click it and Unblock the Notifications











