twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ వదిలేశాడు.. రవితేజ హిట్ కొట్టాడు.. జడ్జిమెంట్ అంటే అదే..

    సినీరంగంలో ఎప్పడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. కథ నచ్చలేదని ఒక హీరో వదిలేసిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన దాఖలాలు చాలానే ఉంటాయి. తాజాగా ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలిచిన స్టోరీ ఇదే..

    By Rajababu
    |

    Recommended Video

    NTR Rejected These Two Hit Movies ఎన్టీఆర్ నో అన్నాడు.. రవితేజ హిట్ కొట్టాడు..

    సినీరంగంలో ఎప్పడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. బాగా ఆడుతుందని అనుకొనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతాయి. ఇదేం సినిమా రా బాబూ అనుకుంటే అలాంటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సినిమా పరిశ్రమలో మరో విషయం ఏమిటంటే.. కథ నచ్చలేదని ఒక హీరో వదిలేసిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన దాఖలాలు చాలానే ఉంటాయి. తాజాగా ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలిచిన స్టోరీ ఇదే..

    ఆది సినిమాతో ఎన్టీఆర్

    ఆది సినిమాతో ఎన్టీఆర్

    గతంలో ఆది సినిమాతో ఎన్టీఆర్ జూనియర్ మంచి జోష్ మీద ఉన్న సమయంలో తన తొలి సినిమా కోసం బోయపాటి శ్రీను తారక్‌ను కలిశాడట. ఆ సినిమా కథ నచ్చకనో.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లనో బోయపాటి చెప్పిన కథకు ఎన్టీఆర్ నో చెప్పాడట.

    భద్ర చిత్రంతో రవితేజ

    భద్ర చిత్రంతో రవితేజ

    డైరెక్షన్ వేటలో పడిన బోయపాటి ఆ తర్వాత అదే కథను మాస్ మహారాజ్ రవితేజకు చెప్పారట. ఆ కథ విన్న తర్వాత ఎక్సైట్ అయిన రవితేజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను తొలిసారి దర్శకుడిగా మారిన సినిమా పేరు.. అదేనండి భద్ర. భద్ర చిత్రంతో రవితేజ మంచి హిట్‌ను అందుకొన్నారు.

    తాజాగా ఎన్టీఆర్‌కు అనిల్ రావిపూడి

    తాజాగా ఎన్టీఆర్‌కు అనిల్ రావిపూడి

    తాజాగా ఇలాంటి సంఘటనే తారక్‌తో ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల రాజా ది గ్రేట్ కథను దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారట. ఆ కథ ఎన్టీఆర్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమా వర్కవుట్ కాలేదట. దాంతో అదే కథకు కొంత మెరుగులు దిద్ది రవితేజకు వినిపించారట. ఆ చిత్ర కథ విని రవితేజ సినిమా చేద్దామని చెప్పడంతో దిల్ రాజు నిర్మాతగా సినిమా ప్రారంభమైంది.

    అనిల్ రావిపూడి, రవితేజ

    అనిల్ రావిపూడి, రవితేజ

    అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన రాజా ది గ్రేట్‌ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. కొన్ని రోజులు ఆగితే కలెక్షన్లపరంగా ఏ రేంజ్ హిట్‌ అనేది తెలుస్తుంది. అయితే రవితేజకు హిట్ పడినట్టే అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

    తారక్ వదిలేసిన సినిమాలతో

    తారక్ వదిలేసిన సినిమాలతో

    తారక్ వదిలేసిన సినిమాలతో రవితేజకు మంచి హిట్లు దొరుకుతున్నాయి. భద్రకు సంబంధించి ఆ కథ ఎన్టీఆర్‌కు సరిపోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ రాజా ది గ్రేట్ కథ మాత్రం అసలు తారక్ సూట్ కాదనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం. ఏది ఏమైనా ఆ రెండు కథలు రవితేజకు మంచి సక్సెస్‌లను తెచ్చిపెట్టాయి. అవి రవితేజ జడ్జిమెంట్‌కు అద్దంపట్టాయి.

    English summary
    Boyapati Srinu's Bhadra movie is big hit for Hero Raviteja. Anil Ravipudi movie Raja the great is another success for Mass Maharaj. Interestingly, these two movies stories were rejected by Junior NTR. These movie become big hits in Ravi Teja career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X