గతంలో ఖతర్నాక్ వంటి సూపర్ ఫ్లాప్ సినిమాలో జంటగా చేసిన రవితేజ,ఇలియానా కాంబినేషన్ మరో సారి రిపీట్ అవబోతోంది. అతనొక్కడే సినిమాతో పాపులర్ అయిన సురేంధ్రరెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను ఆర్.ఆర్.మూవీ బ్యానపై వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయదశమి రోజు(అక్టోబర్ తొమ్మిదిన) ఓపినింగ్ కానుంది. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా కిక్ అని వ్యవరిస్తున్నారు. కోతినాకొడుకు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. సురేంద్రరెడ్డి అతిధి డిజాస్టర్ తర్వాత రూపొందిస్తున్న సినిమా ఇదే. రవితేజ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో నేనింతే చిత్రంలో చేస్తున్నారు. సినీ పరిశ్రమ నేపద్యంలో నిర్మితమయ్యే ఆ చిత్రంలో ముంబై మోడల్ సియా అతనికి జోడిగా చేయనుంది. అలాగే ఇలియానా ..భలేదొంగలు పరాజయం తర్వాత ఒప్పుకున్న చిత్రమిదే.