ఫ్యామిలీతో రవితేజ ఎంజాయ్.. క్రాక్ కొత్త పోస్టర్ వైరల్
మాస్ మహారాజ రవితేజకు కాలం కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క విజయాన్ని అందుకోలేకపోతోన్నాడు. చేసిన ప్రతీ సినిమా బోల్తా కొట్టడంతో రవితేజ కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. వరుస డిజాస్టర్‌లతో రవితేజ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చివరగా వచ్చిన డిస్కోరాజా చిత్రం సైతం రవితేజ ఆశలపై నీళ్లు చల్లింది.
ఎన్నో అంచనాల నడుమ రిలీజైన డిస్కోరాజా సైతం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందని రవితేజ.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని.. రవితేజతో హ్యాట్రిక్ కొట్టేందుకు క్రాక్ అంటూ రాబోతోన్నాడు.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ క్రాక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. టీజర్ విజువల్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతీ ఒక్కటీ సెన్సేషనల్ అయ్యాయి. తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రవితేజ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











