రవితేజ ‘నేల టిక్కెట్టు’ టీజర్ డేట్ వచ్చేసింది
ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం "నేల టిక్కెట్టు".
ఏప్రిల్ 22న ఉదయం 9 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మార్క్ ఎంటర్టెన్మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు చూసేలా ఈ చిత్రం ఉండబోతోంది. సకుటుంబ సమేతంగా చూసేవిధంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది అని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయనున్నారు.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
నిర్మాత: రామ్ తాళ్ళూరి
సమర్పణ: సాయిరిషిక
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల


Click it and Unblock the Notifications











