రవితేజ ఇంత మోసగాడా?
హీరో రవితేజ చిన్న చిన్న పాత్రలు వేసుకొంటూ హీరో రేంజ్ కి ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒక్కరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా నిలదోక్కుకుటోన్న టైమ్ లో సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" చిత్రం రవితేజకి బాగా ఉపయోగపడింది. ఈ సినిమాతోనే అతనికి మంచి గుర్తింపు వచ్చి మంచి అవకాశాలు, వరుస విజయాలతో బాగా బిజీగా వుండటంతో వంశీ చిత్రం లో నటించుటకు అస్సలు తీరిక లేదని చెప్పటంతో ఈ సీనియర్ డైరెక్టర్ మనస్సు కొంత కలత చెందింది. సీనియర్ డైరెక్టర్ వంశీతో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్" సినిమా రవితేజ చేయనున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రవితేజ నటించబోవడం లేదన్నది తాజా వార్త. రవితేజ ప్లేస్ లో 'అల్లరి నరష్" ఈ సినిమా చేయనున్నాడు. ఏదేమైనా 'లేడీస్ టైలర్" ఫ్యాన్స్ కి మాత్రం 'ప్యాషన్ డిజైనర్" ఖచ్చితంగా సెట్స్ పైకి వెల్లనుందని తెలియడం హ్యాపీ న్యూస్. ఈ సినిమాని నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











