రవితేజ కోసం పవన్ కళ్యాణ్, అభిమానులు గెట్ రెడీ!
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన రవితేజ నటించిన నేల టికెట్ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకకు మెగా హీరో రాబోతున్నాడు.
Recommended Video


మాళవిక శర్మ హీరోయిన్ గా
మాస్ మాహారాజ్ రవితేజ చేస్తున్న తాజా చిత్రం 'నేల టికెట్'. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది.

వేసవిలో ప్రేక్షకుల ముందుకు
రవితేజ మార్క్ ఎంటర్‌టైన్మెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా మే 25న విడుదల చేయబోతున్నారని సమాచారం.

నేల టికెట్ కోసం పవన్
ఈ చిత్ర ఆడియోను మే 12వ తేదీన భారీగా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ వస్తే ఈ సినిమా మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది.

మరో సినిమా స్టార్ట్
ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుందిని సమాచారం. రవితేజ ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమాలో నటించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











