»   »  రవితేజ టైం స్టార్ట్స్ నౌ

రవితేజ టైం స్టార్ట్స్ నౌ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ ‌: రవితేజ 'పవర్‌' చూపించడానికి దర్శకుడు కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) అన్ని రకాలుగా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 11 న ఆడియో విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. ఆ రోజు స్పెషల్ టీజర్స్ విడుదల చేసి, పబ్లిసిటీ క్యాంపైన్ మొదలపెట్టనున్నారు. ఆడియో విడుదల తర్వాత కొద్ది రోజుల్లోనే సినిమా విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రసార మాధ్యమాల్లో ఇక రవితేజనే కొద్ది కాలం పాటు కనిపించనున్నారు.

    ఈ మధ్యనే చెన్నై,కలకత్తాలో ఈ చిత్రం షూటింగ్ జరిపి హైదరబాద్ షెడ్యూల్ కి సిద్దపడుతున్నారు. ఇంటర్వల్ మినహా ఫస్టాఫ్ టాకీతో పాటు రెండు పాటలను ఫినిష్ చేసారు. మార్చి మొదటి వారంలో కోలకతా షెడ్యూల్ మొదలు కానుంది. తర్వాత బ్యాంకాక్ వెళ్లి పాట,ఫైట్స్ తీస్తారు. మాస్‌ అంటే బస్‌పాస్‌ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్‌ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు.

    Raviteja Power Audio release on

    నిర్మాత మాట్లాడుతూ.. ''బలుపు'తో మాస్‌ హీరోల్లో తనకు తిరుగులేదని రవితేజ మరోసారి రుజువు చేశారు. దాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్నిచ్చేందుకు ఈ చిత్రం వస్తోంది. మాస్‌ తరహా పోలీసుగా రవితేజ ఆకట్టుకుంటాడు''అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి కథ ఇది. ఈ టైటిల్‌ రవితేజకు నూటికి నూరుపాళ్లూ సరిపోతుంది. '' అన్నారు.

    ''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

    రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

    English summary
    
 Raviteja, Hansika's mass entertainer Power film's audio release on May 11th. Power is the film is about a police officer who uses his power as his weapon. The story and the title are aptly suited for the image and body language of Ravi Teja, director K S Ravindra informed the media. Hansika is the heroine. S S Thaman is scoring the music.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more