రవితేజ-రాజమౌళి సినిమా విక్రమార్కుడు
రవితేజ రాబోయే చిత్రానికి విక్రమార్కుడు అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమా పెద్ద హిట్ అయింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విక్రమార్కుడు సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. అనూష్క, రుతిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ పోటీ, వేడి తగ్గిన తర్వాత ఈ సినిమాను జూలైలో విడుదల కానుంది. తమిళ శంకర్‌లాగా ఎక్కడా రాజీ పడకుండా ఎన్నిరోజులు పట్టినా ఓపిగ్గా చిత్రీకరించే రాజమౌళి ఈ సినిమాను అనుకున్న బడ్జెట్‌లోపలే, షెడ్యూలు ప్రకారం పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సొంత బ్యానర్‌లో ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.


Click it and Unblock the Notifications