మొత్తానికి బావ సినిమాలో చేశానని తెగ సంతోషపడుతున్నాడు రవితేజ. రవితేజ బావ ఎవరనుకుంటున్నారా...దర్శకుడు వివి వినాయకే రవితేజ బావట. వివివినాయక్ దర్శకత్వంలో రూపొందిన కృష్ణ సినిమా ఆడియో విడుదల సందర్భంగా హీరో రవితేజ బావ సినిమాలో నటించానని వినాయక్ ను కౌగిలించుకుంటూ బావా...బావా అంటూ కలవరించాడు. బావ తీసే ఇంకో సినిమాలో కూడా నటిస్తానని రవితేజ అంటుంటే వివివినాయక్ మాత్రం నవ్వలేక నవ్వలేక నవ్వాడు. అపార్థం చేసుకోవద్దుకానీ...ఇదేం అవినా బావ సంబంధమో మరి.