ఆ కమీడియన్స్ తో రవితేజ సినిమా... శ్రీనువైట్ల మార్క్ కామెడి...
నటుడు రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో సినిమా రూపుదిద్దుకుంటోంది. రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్ ఈ సినిమాతో పూర్తి స్థాయి కమిడియన్ గా కనిపించబోతున్నాడు.
రవితేజ, శ్రీను వైట్ల సినిమాలో శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు వంటి కమిడియన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాత కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుండడం విశేషం. వారి పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఓ సినిమాలో మూడు పాత్రలు చేయడం రవితేజకు ఇదే మొదటిసారి. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది. ఈ సినిమాతో శ్రీనువైట్ల బ్యాక్ అవుతాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.


Click it and Unblock the Notifications











