రవితేజకు షాకిచ్చిన ఆ ఇద్దరు హీరోలు.. దిల్ రాజు కోర్టులో సంక్రాంతి వివాదం బంతి!

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగు సినిమాల రిలీజ్ విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది. సంక్రాంతి పండుగ బరిలోకి ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేశారు. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, హనుమాన్, ఈగిల్ సినిమాలను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో థియేటర్లు, స్క్రీన్ల కేటాయింపు వివాదంగా మారింది. ఆ సమయంలో రవితేజ నటించిన ఈగిల్ సినిమాను రిలీజ్ కాకుండా వాయిదా వేయడంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఆ వివాదం అప్పటికీ సద్దుమణిగింది. కానీ ప్రస్తుతం తెరపైకి వచ్చిన కొత్త సమస్య వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరిలో నిలిచిన ఈగిల్ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను నిర్మాతల మండలి తరపున దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు కోరడంతో వారు తమ సినిమాను వాయిదా వేసుకోవడానికి సంసిద్దతను వ్యక్తం చేశారు. అయితే ఈగిల్ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తాం. ఆ సినిమాకు మరో సినిమా పోటీ రాకుండా చర్యలు తీసుకొంటామని దిల్ రాజు ప్రెస్‌మీట్‌లో చెప్పారు.

Ravitejas Eagle to Clash with Sandeep Kishans Ooru Peru Bhairavakona

అయితే దిల్ రాజు ప్రకటన తర్వాత ఈగిల్ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన సింగిల్‌గా ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేయిస్తామని నిర్మాతలు చెప్పారు. ఆ రోజున రిలీజ్ అయ్యే డీజే టిల్లు స్వ్కేర్ సినిమాను ఆపిస్తామని చెప్పారు. ఆ క్రమంలో అందరు ఈగిల్ సినిమ రిలీజ్‌కు సహకరిస్తారని భావించారు.

Ravitejas Eagle to Clash with Sandeep Kishans Ooru Peru Bhairavakona

కానీ ఫిబ్రవరి 9వ తేదీన ఈగిల్ రిలీజ్ గురించి అందరూ ఒకటి అనుకొంటే.. ప్రస్తుతం మరోటి అయ్యేలా కనిపిస్తున్నది. అదే డేట్‌కు ఊరు పేరు భైరవకోన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత, హీరో సందీప్ కిషన్ తెలిపారు. ఈగిల్ సినిమా రిలీజ్ విషయం మాతో నిర్మాతలు చర్చించలేదు. డీజే టిల్లు 2 వస్తుందని తెలుసుకొన్న తర్వాతే మేము మా డేట్‌ను మరోసారి ప్రకటించాం అని సందీప్ కిషన్ ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు.

రవితేజ అంటే నాకు చాలా గౌరవం. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన తప్పితే మరో రోజు రిలీజ్ చేయడానికి వీలు లేకపోవడం ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఈగిల్ సోలో రిలీజ్ విషయం గురించి ఎవరు కూడా మాతో మాట్లాడలేదు. ఒకవేళ వారు మాట్లాడితే.. మేము ఏం చెప్పాలో అది చెప్పడానికి సిద్దంగా ఉన్నాం అని సందీప్ కిషన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X