»   » వెరైటీ టైటిల్ రిజిస్టర్ చేయించిన క్రిష్, అఖిల్ కోసమేనా?

వెరైటీ టైటిల్ రిజిస్టర్ చేయించిన క్రిష్, అఖిల్ కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా... తనదైన మార్కుతో సందేశాత్మక సినిమాలు సైతం ఆకట్టుకునేలా తెరకెక్కించడం దర్శకుడు క్రిష్ స్టైల్. ఇటీవలే ‘కంచె' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న క్రిష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో చేయబోతున్నట్లు సమాచారం.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయన ‘రాయభారి' పేరుతో ఓ టైటిల్ కూడా ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు. టైటిల్ చూస్తుంటే ఇది మరో సందేశాత్మక సినిమా అని స్పష్టమవుతోంది. డిఫరెంట్ టైటిల్ కావడంతో ఈ సినిమా కూడా రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

 ‘Rayabhari’ title for Akhil

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి.. కమర్షియల్ విలువలతో వచ్చిన 'అఖిల్' కు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు సామాజిక సందేశాలతో ముందుకెళ్ళే దర్శకుడిని తీసుకున్నాడన్న తెలుస్తోంది. ఇలా క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

2016 ప్రారంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను గతంలో నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలు రూపొందించిన డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.

English summary
Krish has recently registered ‘Rayabhari’ title in the film chamber. It looks like Krish is planning yet another different film and has registered this title which literally means ‘Messenger’.
Please Wait while comments are loading...