బూతు చూపిస్తూ 'రాయలసీమ లవ్ స్టోరీ' టైటిల్.. అంతా డబుల్ మీనింగే!
బయోపిక్ చిత్రాలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు బోల్డ్ కంటెంట్ చిత్రాల ట్రెండ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాలలో బోల్డ్ కంటెంట్ ఉన్నపటికీ ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాలు ఆకట్టుకున్నాయి. బోల్డ్ చిత్రాల ముసుగులో బూతు చిత్రాలు దూసుకువచేస్తున్నాయి. ప్రేమ కథలు, రొమాన్స్ పేరుతో అస్లీలత ఆయుధంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఏడు చేపల కథ చిత్రం ఆ కోవకు చెందిందే. ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా మరో చిత్రం వచ్చేస్తోంది.

రాయలసీమ లవ్ స్టోరీ
ఈ సినిమా పేరే రాయలసీమ లవ్ స్టోరీ. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే అశ్లీలతతో ఆడియన్స్ ని ఆకర్షించడానికే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శృగార సన్నివేశాలు ఘాటుగా ఉన్నాయి. నూతన నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

వల్గారిటీ ఎక్కువగా
హీరో హీరోయిన్ల మధ్య ఘాటు రొమాన్స్ తో పాటు, సంభాషణల్లో వల్గారిటీ కూడా ఎక్కువగానే ఉంది. 'నన్ను మరిచిపో.. ఎలా మరచిపోమంటావ్.. పైగా అన్నీ అయిపోయాయి' లాంటి డైలాగ్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ కమెడియన్ పృథ్వి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

అంతా కొత్తవారే
రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం ఏ1 ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోంది. డెబ్యూ దర్శకుడు రామ్ రణధీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్, హృశాలి గోసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఏడు చేపల కథ హంగామా
ఏడు చేపల కథ టైటిల్ తో ఓ బూతు చిత్ర టీజర్ ఆల్రెడీ సోషల్ మీడియాని దున్నేస్తోంది. హద్దులు దాటిన శృంగార సన్నివేశాలతో ఈ టీజర్ రచ్చ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో ఒక విచిత్రమైన శృంగార సమస్యతో భాధపడుతుంటారు. ఏడూ చేపల కథ, రాయలసీమ లవ్ స్టోరీ లాంటి చిత్రాలు భవిషత్తులో ఎక్కువ కావడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











