twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు వ్యతిరేకం కాదు, మా ఆవేదన అర్థం చేస్కోండి!

    |

    Recommended Video

    Aravinda Sametha : Rayalaseema Vidyarthi Porata Samithi Demands For Cuts

    'అరవింద సమేత' చిత్రంపై రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కొన్ని వివాదాస్పద డైలాగులు, వివాదాస్పద సీన్లు ఉన్నాయని వాటిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    తాము హీరో ఎన్టీఆర్‌కు కానీ, దర్శకుడు త్రివిక్రమ్‌కు కానీ వ్యతిరేకులం కాదని, వారి గత చిత్రాలు ఎంతో బావున్నాయని, వాటిని తమ ప్రాంత ప్రజలు ఆదరించిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ చిత్రంలో చూపించిన కొన్ని సీన్లు, డైలాగులు తమ ప్రాంతాన్ని నెగెటివ్‌గా ఫోకస్ చేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

     మా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు

    మా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు

    తరతరాలుగా తెలుగు సినిమా పరిశ్రమ తమ ప్రాంతానికి చెందిన ప్రజలను రాక్షసులుగా, హత్యలు చేసే కిరాతకులుగా చూపిస్తున్నారని, ఈ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ తమ ప్రాంతాన్ని మరింత కర్కశంగా చూపించారని, దాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

     ఇక్కడే అలా ఎందుకు?

    ఇక్కడే అలా ఎందుకు?

    రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎప్పుడూ లేదు, అది కొన్ని గ్రామాలకు పరిమితం, అవి కేవలం వ్యక్తిగతమైన కక్షలు. ఇలాంటి గొడవలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. విజయవాడలోనూ, హైదరాబాద్‌లోనూ ఇలాంటివి జరుగుతున్నాయని.... కానీ సినిమాల్లో తమ ప్రాంతాన్ని ఒక భయంకరమైన ఏరియాగా చూపిస్తున్నారని రాయలసీమ ప్రజా సంఘాలు నేతలు మండి పడ్డారు.

     ప్లాపులు రాగానే రాయలసీమపై

    ప్లాపులు రాగానే రాయలసీమపై

    ఎప్పుడైతే రెండు ప్లాపులు వస్తాయో... ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా వాళ్లకు హిట్ ఫార్ములా రాయలసీమ ఫ్యాక్షనిజం గుర్తుకు వస్తుంది. రాయలసీమలో ప్రజలను రాక్షసులుగా చిత్రీకరిస్తూ ఈ ప్రాంత ప్రజల మీద బురద జల్లుతూ కాసులు పండించుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     వివాదాస్పద డైలాగులు ఇవే

    వివాదాస్పద డైలాగులు ఇవే

    ఈ నేల కత్తి పట్టమంటుందని, ఈ డీఎన్ఏలోనే రక్తపాతం ఉందని, ఈ ప్రాంత ప్రజలు మారనివ్వరు అని అర్థం వచ్చేలా డైలాలుగు చెప్పించండం, సొంత కొడుకును చంపడం కూడా చూపించారు. ఏదో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఫ్యాక్షన్‌ను ఈ రోజు రాయలసీమ ప్రజలందరికీ ఉన్నట్లు, రాయలసీమ ప్రజలంటేనే ఫ్యాక్షన్ తో కొట్టుకు చచ్చే వాళ్లు అన్నట్లు చూపించడం దారుణమని ఫైర్ అయ్యారు.

    గౌరవప్రదమైన వృత్తిలో ఉండి దిగజారితే ఎలా?

    గౌరవప్రదమైన వృత్తిలో ఉండి దిగజారితే ఎలా?

    రాయలసీమ ప్రజలు కత్తులు పట్టుకుని తిరుగుతుంటారని, మొహాలు గాట్లు పెట్టుకుని ఉంటారని చూపించారు. సమాజం మేలు కోసం పని చేయాల్సిన ఒక గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద డైరెక్టర్లు కూడా దిగజారి ఒక ప్రాంతం మీద బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఏమిటీ డైలాగులు?

    ఏమిటీ డైలాగులు?

    ఈ సినిమాలోని అభ్యంతరకంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలి.... కొండారెడ్డి బురుజు నుంచి, కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి, అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నుంచి, బెలూన్ గుహల వరకు తరిమి తరిమి నరుకుతానని డైలాగులు పెట్టడం దారుణం.

     మాపై విషం చిమ్మే సినిమాలు ఆపండి

    మాపై విషం చిమ్మే సినిమాలు ఆపండి

    రాయలసీమ ప్రాంతంలో ఎక్కడో కొన్ని గొడవలు జరిగితే, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సీమను రెచ్చగొట్టి మరోసారి రాయలసీమ ప్రాంతాన్ని నెగెటివ్‌గా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో రాయలసీమ మీద విషంచిమ్మే సినిమాలు ఎవరూ తీయొద్దని కోరుతున్నాం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయవద్దని మా అసోసియేషన్‌ను కూడా కలవనున్నట్లు రాయలసీమ ప్రజా సంఘాలు తెలిపాయి.

    English summary
    Rayalaseema Vidhyarthi Porata Samithi student leaders, People's organizations leaders raised objections against some of the scenes and dialogues in Aravindha Sametha movie. "We are not against the hero and the director.: They said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X