స్పీడు మీదున్న బోయపాటి, రాంచరణ్.. బ్యాంకాక్ ఫినిష్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం ఘనవిజయం తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం బ్యాంకాక్ లో జరుగుతున్న కీలక షెడ్యూల్ నేటితో ముగిసింది. భరత్ అనే నేనుతో తొలి చిత్రంతోనే తెలుగులో ఘనవిజయం అందుకున్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది. బాలీవడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రాంచరణ్ ఈ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. తదుపరి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో మల్టి స్టారర్ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇప్పటివరకు బోయపాటి తెరకేకించిన సన్నివేశాల అవుట్ పుట్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











