#RC15 Shoot Starts.. ఏకకాలంలో #DilRaju మూడు పాన్ ఇండియా సినిమాలు.. ముగ్గురు సూపర్‌స్టార్స్‌తో అదిరిపోయేలా!

టాలీవుడ్‌లో డిస్టిబ్యూటర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి అగ్ర నిర్మాతగా మారిన దిల్ రాజు అతి తక్కువ కాలంలోనే 50 చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. తాజాగా వకీల్ సాబ్ అందించిన ఉత్సాహంతో మరో మూడు ప్యాన్ ఇండియా చిత్రాలను ఏకకాలంలో ప్లాన్ చేశాడు. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమైన దిల్ రాజు ఇప్పడు దేశవ్యాప్తంగా స్టార్ ప్రొడ్యూసర్‌గా బ్రాండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దిల్ రాజు చేపట్టిన మూడు ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..

ఇళయ దళపతి విజయ్‌తో

ఇళయ దళపతి విజయ్‌తో

మాస్టర్ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొన్న తమిళ దళపతి విజయ్‌తో దిల్ రాజు ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావోచ్చాయి. దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రారంభోత్సవం చేయాలని దిల్ రాజు, వంశీ పైడిపల్లి ప్లాన్ చేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో

అలాగే చాలాకాలంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఐకాన్ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడానికి కరోనా, ఇతర అంశాలు తోడయ్యాయి. వకీల్ సాబ్ లాంటి హిట్టు కొట్టిన తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ మరోసారి అల్లు అర్జున్‌తో ఐకాన్ పట్టాలెక్కించే ప్రయత్నం సఫలమైంది. దిల్ రాజు, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఐకాన్ చిత్రం దసరా పండుగ రోజున అంటే అక్టోబర్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది.

 మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో

ఇక మూడో ప్రాజెక్టుగా రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో #RC15 చిత్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాంచరణ నటిస్తున్న RRR చిత్ర షూటింగు పూర్తయిన నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీన చెర్రీ సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తపు షాట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా

రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా

దిల్ రాజు నిర్మాతగా రూపొందే #RC15 చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవానికి టాలీవుడ్‌లోని టాప్ ప్రముఖులందర్ని ఆహ్వానించినట్టు తెలిసింది. కేవలం తెలుగు సినిమా ప్రముఖులే కాకుండా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్టు సమాచారం. ఈ ప్రారంభోత్సవాన్ని శంకర్ సినిమాకు తగినంత రేంజ్‌లో చేయడం గమనార్హం.

కియారా అద్వానీ ఫోటోషూట్ హైదరాబాద్‌లో

కియారా అద్వానీ ఫోటోషూట్ హైదరాబాద్‌లో

దిల్ రాజు, రాంచరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న #RC15 చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ కోసం ముంబై నుంచి కియారా అద్వానీ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రాంచరణ్, కియారా అద్వానీపై ఫోటోషూట్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. #RC15 సినిమా ప్రారంభోత్సవం విశేషాల గురించి తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X