సెక్స్ అంటే సిగ్గెందుకు? ఓపెన్‌ అయిన పాయల్.. సేఫ్టీపై సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

'You Need A Condom Before Going Into Bed' : Payal Rajput || సేఫ్టీ పై పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్

పాయల్ రాజ్‌పుత్.. తెలుగు తెరపై తొలి సినిమా తోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ ఈమె. వెండితెరపై రొమాంటిక్ సీన్స్ పండించడంలో తనకు పోటీగా వచ్చే హీరోయినే లేదన్నట్లుగా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది పాయల్. దీంతో ఆమె ఫస్ట్ మూవీ Rx 100 సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పాయల్ వరుస అవకాశాలు పట్టేసింది. ఇందులో భాగంగా ఆమె RDX లవ్ అనే సినిమాతో మరికొద్ది రోజుల్లోనే మనముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా మాట్లాడింది పాయల్. ఆ వివరాలేంటో చూద్దామా..

RDX లవ్ మూవీ.. బోల్డ్ సీన్స్

RDX లవ్ మూవీ.. బోల్డ్ సీన్స్

పాయల్ రాజ్‌పుత్ నటించిన తాజా సినిమా RDX లవ్. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి జనాల్లో ఓ రేంజ్ ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. సెక్స్, సేఫ్టీ లాంటి అంశాలపై కనిపించిన సీన్స్ యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకర్షించాయి. ఇక తాజాగా ఇదే అంశంపై పాయల్ చాలా చాలా ఓపెన్‌గా మాట్లాడేసి షాకిచ్చింది.

Rx 100తో పోల్చొద్దు

Rx 100తో పోల్చొద్దు

RDX లవ్ సినిమాను Rx 100తో పోల్చవద్దని అంటోంది పాయల్. ఈ సినిమాకు Rx 100తో సంబంధం లేదని, అలివేలు పాత్రలో ఊరి కోసం పాటు పడే లేడీగా తాను RDX లవ్ సినిమాలో కనిపిస్తానని చెప్పింది. కథలో భాగంగా బోల్డ్ సీన్స్, సెక్స్ లాంటి ఎన్నో సన్నివేశాల్లో నటించానని చెప్పిన ఆమె.. స్టోరీ డిమాండ్ చేస్తే అలా నటిచడంలో తప్పేముందని అనేసింది.

పీరియడ్స్, సెక్స్, సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ అన్నీ..

పీరియడ్స్, సెక్స్, సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ అన్నీ..

దేశంలోని ప్రజలు సెక్స్, పీరియడ్స్ లాంటి విషయాలపై మాట్లాడేందుకు సిగ్గు పడతారు. కానీ మేము ఓపెన్‌గా ఈ సినిమాలో అన్నిటి గురించి చెప్పబోతున్నాం.
లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన చాలా విషయాలు చర్చించాం అని చెప్పింది పాయల్. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పడే కష్టాలు, సెక్స్ గురించి, సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ అన్నింటిపై ఓ అవగాహన తీసుకొచ్చే సినిమానే ఇది అని అంటోంది పాయల్.

అపరిచితులతో సెక్స్ చేసేటపుడు..

అపరిచితులతో సెక్స్ చేసేటపుడు..

అపరిచితులతో సెక్స్ చేసేటపుడు కండోమ్స్, సేఫ్టీ గురించి ఆలోచించడంలో తప్పేముందని.. దాని కారణంగా ఇద్దరి జీవితం సేఫ్‌గా ఉంటుందని ఓపెన్‌గా మాట్లాడుతూ షాకిచ్చింది పాయల్. ఇలాంటి విషయాల్లో సిగ్గు పడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఈ విషయాలు చెప్పడానికి కూడా తాము మాత్రం సిగ్గు పడటం లేదని, గర్వపడుతున్నామని సెన్సేషనల్‌గా మాట్లాడింది పాయల్.

బోల్డ్ సినిమానే.. మీ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే

బోల్డ్ సినిమానే.. మీ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే

RDX లవ్ బోల్డ్ సినిమానే అని, మీ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కాస్త సిగ్గుగానే ఉంటుంది.. కానీ అందరిలో ఈ విషయాల పట్ల అవగాహన తీసుకురావాలనే ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పింది పాయల్. ఈ కంటెంట్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనలో ఉందని ఈ సందర్బంగా పేర్కొంది.

RDX లవ్ మూవీ

RDX లవ్ మూవీ

హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X