twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ట్విట్టర్లో చేరడంపై....హీరోల కామెంట్స్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో చేరడం హాట్ టాపిక్ అయింది. ఆయన కంటే వెనక వచ్చిన వారంతా ఇప్పటికే సోషల్ మీడియాలో చేరి లక్షల మంది అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయన మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఖాతా తెరవలేదు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు అలా చేయాల్సిన అవసరం కూడా ఆయనకు లేదనుకోండి. పవర్ స్టార్ సోషల్ మీడియాలో ఉన్నా, లేకున్నా ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది.

    అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకగా అభిమానుల కోసం ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసారు. ఆయన ఖాతా తెరవడమే ఆలస్యం....ఒక రోజు తిరిగే సరికి లక్ష మంది ఫాలోవర్స్ అయిపోయారు. ట్విట్టర్ సెలబ్రిటీ ప్రపంచంలో ఇదో రికార్డు అని చెప్పొచ్చు.

    పవన్ కళ్యాణ్ ట్విట్టర ఖాతా తెరవడంపై టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేసారు.

    పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నిఖిల్ స్పందిస్తూ...

    ‘ట్విట్టర్లో దేవుడు చేరిపోయాడు. నమ్మలేక పోతున్నాను. కానీ ఇది నిజం. ఆయన ఎలాంటి ట్వీట్స్ చేస్తారోనని ఎదురు చూస్తున్నాను. ఆయన తన స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసాడు. అతని ఆలోచనలతో మనల్ని ఇన్ స్పైర్ చేసారు. మంచి రాజకీయాల కోసం పోరాడుతున్నాడు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు' అంటూ ట్వీట్ చేసాడు.

    వరుణ్ తేజ్ స్పందిస్తూ...

    ‘బాబాయ్ ట్విట్టర్లో చేరాడు. నమ్మలేక పోతున్నాను' అంటూ ట్వీట్ చేసాడు.

    నాని స్పందిస్తూ...

    ‘చుడప్పా సిద్ధప్పా..పవన్ కళ్యాణ్ సింహం లాంటోడు. దానికి ట్విట్టర్ అకౌంట్ ఉండదు, ఈయనకి ఉంటుంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్' అంటూ ట్వీట్ చేసాడు.

    పరుచూరి గోపాల కృష్ణ స్పందిస్తూ...

    ‘ట్విట్టర్ ప్రపంచానికి స్వాగతం. నీయొక్క ట్వీట్స్ యువతను ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. డెమోక్రసీని బలపరిచే విధంగా ఉండాలి. జనసేన త్వరలోనే ప్రభంజన సేన అవుతుంది' అంటూ ట్వీట్ చేసారు.

    హరిష్ శంకర్ స్పందిస్తూ...

    ‘వావ్..ఇప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను. ట్విట్టర్లో మా దేవుడు. మా గబ్బర్ సింగుకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను' అని ట్వీట్ చేసారు.

    సంజన స్పందిస్తూ...

    అతని సినిమాల ప్రేమలో పడిపోయాను.ఆయన్ను ట్విట్టర్లో పాలో అవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది.

    కోన వెంకట్ స్పందిస్తూ...

    ‘మొత్తానికి మై బ్రదర్ పవర్ స్టార్ ట్విట్టర్లో చేరారు. ఆయనకు స్వాగతం. మీయొక్క తీరు డిఫరెంటుగా ఉంటుందని నమ్ముతున్నాను. 2015కు గుడ్ బిగినింగ్' అంటూ ట్వీట్ చేసారు.

    శరత్ మరార్ స్పందిస్తూ..

    ‘ట్విట్టర్లో ఆయనకు లభించిన ఫాలోయింగ్ అమేజింగ్' అంటూ ట్వీట్ చేసారు.

    తమన్నా

    మై డియరెస్ట్ సర్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేరారు. ఆయనకు స్వాగతం

    శృతి హాసన్

    వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో
    చేరడం..ఆనందకరమైన విషయం!

    English summary
    Pawan Kalyan official twitter account got 123k followers and it’s the number is growing with rapid speed.Several fans and celebrities have expressed happiness and surprise over Pawan joining Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X