twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులకు పెద్ద శిక్ష వేసిన "అప్పలరాజు"(పాఠకుల రివ్యూ-2)

    By ---వి. భాస్కర రెడ్డి
    |

    "రోటిన్ సినిమాలనుంచి మిమ్మల్లి రక్షించాడానికి వస్తున్నాడు అప్పలరాజు" అంటూ పబ్లిసిటీకి వచ్చిన అప్పలరాజు రోటిన్ సినిమాలకంటే దారుణంగా ప్రేక్షకులను శిక్షించాడు. సినిమా టైటిల్స్ ముందే ఈ సినిమా కామెడీ కాదు అని చెప్పటం ద్వారా ఎన్నో ఆశలతో(కామెడీ) వచ్చిన వారికి ముందే నిజం చెప్పి, రోటిన్ సినిమాలలాగే శిక్షను అనుభవించడానికి సమాయత్తపరిచాడు వర్మ.

    సునీల్ సినిమా అనగానే కామెడీ చాలా వుంటుందని ఎంతో ఆశతో వెళ్ళినవారిని నిరాశనే ఎదురవుతుంది. సునీల్ సినిమా మొత్తం సీరియస్‌గా , సెటైర్‌లు ఏమి లేకపోవడంతో బోరుకొట్టేస్తుంది. నేనింతే సినిమాను చూసి వర్మ స్టోరి రాశాడేమో అనిపిస్తుంది. మాస్ రవితేజ కై ఫైట్స్ వుంటే , ఇక్కడ కామెడీ సునీల్ కు కామెడీ లేదు. సీరియన్‌గా చేసిన సునీల్ తన పాత్రలో లీనమై న్యాయం చేశాడు. డ్యానులలో కూడా బాగా చేశాడు.

    వర్మ కథ కథనంలో కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడిని నిరాశే మిగిలింది. నాయకి అనే ట్రాజెడీ కథతో వచ్చిన హీరోకి చివరకు కామెడీ అవార్డ్ రావడం కొంత గందరగోళానికి గురిచేస్తుంది. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన సన్నివేశాలు , పాటలు కలుపుతూ పోయి చివరకు ట్రాజెడీని కామెడీ మార్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టడం వర్మ ప్రేక్షకులపై కూడా సెటైర్‌కు నిదర్శణం. తాము ప్రయోగాలతో వస్తే మీరు అదరించరు కాబట్టే మాస్ మసాల , ఐటమ్ సాంగ్ స్టెప్పులు , ద్వంద్వర్థాల పాటలు పెడతామని సినిమా పిచ్చోళ్ళకు చెప్పకనే చెప్పాడు. ప్రతి ఒక్కరిని విమర్శించే వర్మకు ప్రేక్షకుడు ఇచ్చే షాక్ తో కోలుకోవాలని దేవుడిని కోరుకుద్దాం!

    కాని కొన్ని పాత్రలు ఎందుకు వున్నాయో తెలియదు(ఆస్టిటెండ్ డైరక్టర్లు ,నల్ల శ్రీను....),సైటర్‌లతో కూడిన పాటలు ఓకే....., స్వాతి ఎందుకు వుందో వర్మకే తెలియాలి..ఎంతో అశలతో వెళ్ళిన వారికి నిరాశనే మిగులుతుంది. వేణుమాధవ్ కామెడీ పర్వాలేదు అనిపించింది. కోటి బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా లేదు, సినిమా చివరిలో మ్యూజిక్ మగధీర నుండి కాపీ అని అందరికి తెలిసిందే. రోటిన్‌కు భిన్నంగా లేని ఈ సినిమాను చూడవలసిన అవసరం లేదు.

    English summary
    Appalaraju hails from Amalapuram. He watches each and every film that releases. But he does not like any of them. He has no good opinion on the current generation directors. So he sets out to make his own film, Nayaki and lands in Hyderabad. In due course, he comes across characters such as Krishna Reddy (Swathi), an assistant director who doesn't know Telugu, Onti Kannu Gavarraju (Kota Srinivasa Rao), Srisailam (Brahmanandam), etc. Will Appalaraju succeed in his mission? One has to watch the film to find out the answer!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X