ఆ రెండు సీన్స్ తీసీస్తే తీన్ మారే
ఈ చిత్రంలో రెండు సీన్స్ కి అర్దం లేదు అనిపించింది.అవి ఫస్టాఫ్ లో త్రిషను చూసి పవన్ కళ్యాణ్ ఇటాలియన్ భాషలో చెప్పే లెంగ్తీ డైలాగ్ ఉన్న సన్నివేశం.రెండవది..అలీ తో ఉన్న హోటల్ సీక్వెన్స్. త్రాగేసి డైలాగులు చెప్పటం అవసరమా అనిపించింది. ఈ రెండు సీన్స్ ఎడిటింగ్ చేసి ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సినిమా అంతా పవన్ కల్యాణ్ స్టైల్ తో చేసిన మ్యాజిక్. ఇక స్పాట్ డబ్బింగ్ చెప్పించటం తో ఫస్టాఫ్ లో చాలా సీన్స్ లో డైలాగులు అర్దం కాలేదు. ఇక నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్యాన్ ని. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ బాగా నచ్చుతుంది. ఆయన ఈ చిత్రంలో చేసిన రెండు పాత్రలకు వేరియేషన్ చూపిస్తూ చేసారు.ఆ విభిన్నతే నన్ను నాలుగు సార్లు ఈ సినిమా చూసేలా చేసింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి హిట్టు అవసరమైన టైమ్ లో వచ్చింది.
రివ్యూ బై:కల్యాణ్ బాలాజీ
[email protected]
మీరు కూడా రివ్యూలు రాస్తే [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.పబ్లిష్ చేస్తాం.


Click it and Unblock the Notifications











