రామ్, జెనాలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం 'రెడీ'. ఈ చిత్రాన్ని జూన్ 14 కి అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల గత చిత్రాల లాగానే ఇందులోనూ బ్రహ్మానందం కీలక పాత్రలో కనపడి నవ్వించబోతున్నాడుట. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ను మే 21 న విడుదల చేస్తున్నారు.