'రెడీ'... రెడీ

ఇక 'రెడీ'లో రామ్ బళ్లారికి చెందిన ఇంజనీరింగ్ విధ్యార్థిగా నటించాడు. కథ ప్రకారం అతనిది ఉమ్మడి కుటుంబం. ఒకసారి అతను పనిమీద హైదరాబాదుకు వస్తాడు. అక్కడ జెనీలియా పరిచయమవుతుంది. ఆమె అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయి. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఆమెతో ప్రేమవల్ల చిక్కుల్లో పడతాడు రామ్. వాటిని అతను ఎలా ఎదుర్కొని తన ప్రేమను గెలిచాడనేది కథ. ప్రేమ, యాక్షన్ మిళితమైన ఈ ఫ్యామిలీ డ్రామా బళ్లారి, హైదరాబాద్, వైజాగ్, అరకు, చాలక్కుడి (కేరళ) నేపథ్యాల్లో నడుస్తుంది. ఇప్పటికే రామ్, జెనీలియా, శ్రీను వైట్ల కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియోట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











