సక్సెస్ ఢీ కొనేందుకు 'రెడీ'

శ్రీను వైట్ల 'ఢీ', 'దుబాయ్ శీను'సినిమాల విజయంతో మంచి జోరుమీదున్నాడు. ఇక 'రెడీ'తో హ్యాట్రిక్ సాధిస్తాననే నమ్మకాన్ని అతను వ్యక్తం చేస్తున్నాడు. శ్రీను చెప్పేదాని ప్రకారం 'రెడీ' లోని రామ్‌లో ఎప్పుడూ ఒక ఫైర్ కనిపిస్తూ వుంటుంది. ప్రేమ కోసం, కావలసిన వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటాడు. ఈ సినిమా రామ్ కు డిఫరెంట్ డైమెన్షన్‌ని ఇస్తుందని అతను నమ్ముతున్నాడు. మాస్ అంశాలు పుష్కలంగా వున్నందు వల్ల ఈ సినిమాతో రామ్ మాస్‌కి బాగా దగ్గరవుతాడని అతడు భావిస్తున్నాడు.
ఇందులో రామ్ బళ్లారికి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తాడు. తన మునుపటి రెండు సినిమాల్లోని పాత్రలకు భిన్నంగా 'రెడీ'లోని పాత్ర వుండేలా జాగ్రత్తలు తీసుకున్నానని రామ్ చెబుతున్నాడు. అయితే 'దేవదాసు'పాత్రకీ, ఈ పాత్రకీ ఒక పోలిక మాత్రం వుంది. అది దేనికీ భయపడకుండా అనుకున్నది సాధించేందుకు దేనికైనా తెగించే మనస్తత్వం.ఆ పాత్రలో చురుకుదనం, రఫ్‌నెస్.. రెండూ వుంటాయి.
రామ్ సరసన నాయికగా ఈ సినిమాలో జెనీలియా నటించింది. 'బొమ్మరిల్లు', 'ఢీ' సినిమాలతో ఆమె హాట్ హీరోయిన్‌గా మారింది. 'రెడీ'లో ఆమె ఎన్నారై అమ్మాయిగా కనిపించనున్నది. హైదరాబాద్‌లో అనుకోకుండా తారసపడ్డ ఆ అమ్మాయిని రామ్ ఎలా ప్రేమ ముగ్గులోకి దింపాడు. దానివల్ల అతడు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొని, విజయం సాధించాడనేదే కథ. బళ్లారి, హైదరాబాద్, వైజాగ్ నేపథ్యాల్లో నడిచే కథతో ఇది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు మార్కెట్లో వినపడుతున్నాయి. ఇక 'ఢీ' కోనవెంకట్ స్క్రిప్ట్ అందించిన 'రెడీ.. దేనికైనా' జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications











