ఇండియన్ సినీ చరిత్రలో...హీరో సూర్య సరికొత్త ఫీట్!
సూర్య నటించిన యాక్షన్ ఎంటర్టెనర్ 'సింగం'. హరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీసు వద్ద ఓ రేంజిలో హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ సృష్టించిన ఈచిత్రం హీరో సూర్యకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.
ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం సూర్య, హరిల కాంబినేషన్లో 'సింగం-2' తెరకెక్కుతోంది. సిక్స్ ప్యాక్ బాడీతో సూర్య కనిపించబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తొలి భాగాన్ని మించి రెండో భాగం ఉండటంతో త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీపై సర్వత్రా భారీ అంచనాలే నెలకొన్నాయి.
అయితే 'సింగం' సీక్వెల్‌ను ఇంతటితో ఆపడం లేదట. త్వరలో 'సింగం-3' కూడా రాబోతోందట. ఇటీవల సూర్య మీడియాతో మాట్లాడుతూ.....దర్శకుడు మంచి స్క్రిప్టు రెడీ చేస్తే 'సింగం-3' చేయడానికి కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. అదే జరిగితే ఇండియన్ సినీ చరిత్రలో సూర్య సరికొత్త ఫీట్ సాధించినట్లే!


Click it and Unblock the Notifications












