twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ సినీ చరిత్రలో...హీరో సూర్య సరికొత్త ఫీట్!

    By Bojja Kumar
    |

    చెన్నై : తమిళ నటుడు సూర్య ఇండియన్ సీనీ చరిత్రలో సరికొత్త పీట్ సాధించబోతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో పలు సీక్వెల్ సినిమాలు వచ్చినప్పటికీ అవి కేవలం రెండో భాగం వరకు మాత్రం పరిమితం అయ్యాయి. కానీ సూర్య తొలిసారిగా మూడో సీక్వెల్‌ను చేయబోతున్నారు.

    సూర్య నటించిన యాక్షన్ ఎంటర్టెనర్ 'సింగం'. హరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీసు వద్ద ఓ రేంజిలో హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ సృష్టించిన ఈచిత్రం హీరో సూర్యకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.

    ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం సూర్య, హరిల కాంబినేషన్లో 'సింగం-2' తెరకెక్కుతోంది. సిక్స్ ప్యాక్ బాడీతో సూర్య కనిపించబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తొలి భాగాన్ని మించి రెండో భాగం ఉండటంతో త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీపై సర్వత్రా భారీ అంచనాలే నెలకొన్నాయి.

    అయితే 'సింగం' సీక్వెల్‌ను ఇంతటితో ఆపడం లేదట. త్వరలో 'సింగం-3' కూడా రాబోతోందట. ఇటీవల సూర్య మీడియాతో మాట్లాడుతూ.....దర్శకుడు మంచి స్క్రిప్టు రెడీ చేస్తే 'సింగం-3' చేయడానికి కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. అదే జరిగితే ఇండియన్ సినీ చరిత్రలో సూర్య సరికొత్త ఫీట్ సాధించినట్లే!

    English summary
    
 "I would love to do the third part of "Singam" provided my director has the patience and time to work again. The excitement with with which we have worked for this film has given me the confidence to work again if there is a third instalment in the offing," Surya told reporters here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X